కొమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి వర్ధంతి సందర్భంగా నల్లగొండ పట్టణంలోని ఎన్‌జీ కాలేజీలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ఇళా త్రిపాఠి అధికారికంగా ప్రారంభించి, ప్రతీక్ రెడ్డి స్మృతికి అంకితంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్వచ్ఛందంగా రక్తదానం చేయడం ద్వారా అనేకమంది ప్రాణాలను రక్షించవచ్చని అన్నారు. ముఖ్యంగా పేదలు, అత్యవసర చికిత్స అవసరమైన రోగులకు రక్తం ఎంతో అవసరమవుతుందని, అందుకే ప్రజలు, యువత, స్వచ్ఛంద సంస్థలు ఎక్కువగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.
శిబిరంలో పెద్ద సంఖ్యలో దాతలు పాల్గొని రక్తదానం చేయడం ద్వారా సామాజిక బాధ్యతను చాటుకున్నారు. ఆసుపత్రుల్లో రక్త నిల్వలు పెంచడం, రక్తదానం పై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్, ఆర్‌డీఓ అశోక్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రమేష్ గౌడ్, నల్లగొండ మహిళా అధ్యక్షురాలు దుబ్బా సాత్వికతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని దాతలను ప్రోత్సహించారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments