ePaper
Thursday, March 19, 2026

డుబ్బ సాత్వికకు కీలక బాధ్యత

హైదరాబాద్: నల్గొండ జిల్లా నుంచి డుబ్బ సాత్వికను తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా నియమించారు. ఈ నియామకానికి ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబ ఆమోదం తెలిపారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుంది.

మహిళా కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేసి, చైతన్యవంతంగా తీర్చిదిద్దడంలో సాత్విక కీలక పాత్ర పోషిస్తారని తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు మొగిలి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు సాత్వికకు శుభాకాంక్షలు తెలిపారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!