• – ఎన్నికలను ప్రశాంత వాతావరణలో నిస్పక్షపాత నిర్వహణే లక్ష్యంగా పని చేయాలి
విజయోత్సవ ఊరేగింపులు, ర్యాలీలకు అనుమతి లేదు
–జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపీఎస్

జిల్లాలో రేపు 11వ తేదీన మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల జరగనున్న నేపథ్యం లో ప్రజలు ప్రశాంత వాతావరణంలో, నిస్పక్షపాతంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీస్ అధికారులు,సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా యస్పి గారు అన్నారు.
ఎన్నికల విధులు నిర్వహించే పోలీసు అధికారులు,సిబ్బంది అందరూ ఎన్నికల సంఘం నియంత్రణ,పర్యవేక్షణ మరియు క్రమశిక్షణకు లోబడి పని చేయాలని సూచించారు. ఎలక్షన్స్ సమయంలో పోలీసు అధికారులు ఎలక్షన్ రోజు,ఎలక్షన్ తర్వాత కౌంటింగ్ పూర్తి అయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాల పై పూర్తిగా అవగాహన కలిగి ఉండి, పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ రోజు, పోలింగ్ కేంద్రాల దగ్గరా పాటించాల్సిన నియమాలను తెలియజేశారు. పోలీస్ అధికారులు ఎలక్షన్ సమయంలో సమస్యలు సృష్టించే వారి పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
పోలింగ్ రోజు పోలింగ్ స్టేషన్ల దగ్గర 163 (బి.యన్.ఎస్.ఎస్)యాక్ట్ అమల్లో ఉంటుందని, పోలింగ్ కేంద్రాల 100 మీటర్ల లోపల ఎవ్వరినీ రానివ్వకూడదని ఓటు హక్కు వినియోగించుకోనే వారు పోలింగ్ కేంద్రాల కు ఎట్టి పరిస్థితిలో సెల్ ఫోన్లు, ఇంక్ బాటిల్స్,ఇతర హాని కలిగించే వస్తువులు తీసుకురాకుండా జాగ్రత్తగా తనిఖీ చేయాలని అన్నారు.
ఏదైనా సమస్య వస్తె వెంటనే సంబంధిత అధికారులు సమాచారం అందించాలని అన్నారు.
ఎన్నికల రోజు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మొబైల్ రూట్ లలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే క్షణాలలో రూట్ మొబైల్ టీమ్ లు అక్కడకు చేరుకొని సమస్యను పరిష్కరించగలగాలి అని అందుకు లోకల్ ఎస్సై, రూట్ మొబైల్ ఇంచార్జి అధికారి కమ్యూనికేషన్ లో ఉంటూ కో ఆర్డినేషన్ చేసుకోవాలని తెలియజేశారు.
అదేవిధంగా ఆయా పోలీస్ స్టేషన్ పరిదిలో ఉన్న మొబైల్ రూట్ లను, వాటి పరిధిలో కి వచ్చే గ్రామాలు, క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వివరాలను, ఆక్కడ నియమించిన పోలీస్ అధికారుల వివరాలను పరిశీలించి ఆయా రూట్ లలో క్రిటికల్ పోలింగ్ కేంద్రాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పై పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు.
ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ఊరేగింపు,ర్యాలీలకు అనుమతి లేదని ఈ సందర్బంగా తెలియజేసారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments