హక్కులను కాపాడడంలో పోలీస్ పాత్ర కీలకమని,
ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఈరోజు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు హక్కులు మరియు వాటి పరిరక్షణ గురించి, ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ మెంబర్ మరియు మాజీ స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గారు వివరించారు. మానవ హక్కులు అంటే ప్రతి మనిషికి పుట్టుకతోనే లభించే హక్కులు. జీవన హక్కు, విద్యా హక్కు, మాట స్వేచ్ఛ, న్యాయం పొందే హక్కు, వివక్షను నిరాకరించే హక్కు వంటి అనేక హక్కులు మొదలైనవి. ఈ హక్కులు రక్షించబడితేనే మనిషి సంపూర్ణ వ్యక్తిత్వంతో ఎదగగలడని, ఇటువంటి హక్కులను కాపాడేటువంటి వ్యవస్థ పోలీస్ వ్యవస్థ. సమాజంలో ఎప్పుడైతే పోలీసు వ్యవస్థ నిష్పక్షపాతంగా పనిచేస్తుందో అప్పుడే మానవుల యొక్క అన్ని హక్కులను కాపాడేందుకు దోహదపడతాయి అని తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీనివాసరాజు గారు మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచి విద్యార్థినీ విద్యార్థినిలు తమ యొక్క హక్కులను ఎలా కాపాడుకోవాలో కళాశాల విద్యార్థినిలకు వివరించడం జరిగింది. కళాశాల గ్రంధాలయ శాస్త్ర అధ్యాపకుడు డాక్టర్ సుంకరి రాజారామ్ మాట్లాడుతూ, ఈ రోజుల్లో అవినీతి 50 శాతం తగ్గిందని, ఇంక రానున్న రోజుల్లో మిగతా 50 శాతం నిర్మూలించే బాధ్యత భారతదేశంలోని యువతపై ఎక్కువగా ఆధారపడి ఉందని, యువత తమ హక్కులను గుర్తించి, వాటిని సాధించే దిశగా పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వచ్చేసినటువంటి డాక్టర్ యుర్రమాద కృష్ణారెడ్డి మాజీ RTI మానిటరింగ్ కమిటీ సభ్యులు,సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మాట్లాడుతూ, విద్యార్థినిలు జీవితంలో తమ హక్కులను కాపాడుకోవడానికి సమాచార హక్కు చట్టం ఎంతో విలువైనదని, దాని యొక్క ప్రతిఫలాల గురించి విద్యార్థినులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ 4 యూనిట్ల యూనిట్లు మరియు కళాశాల గ్రంథాలయ శాస్త్ర శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ దయానంద్, డాక్టర్ వసంత, చైతన్య సుధ, పుష్పలత గార్లు, గ్రంథాలయ శాఖ అధ్యాపకులు డాక్టర్ సుంకరి రాజారామ్, కళాశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీమతి మంజుల అధ్యాపకులు డాక్టర్ సాలయ్య డాక్టర్ సునీత, వనజ, అజయ్ కుమార్, రామ్ రెడ్డి హేమలత, బొగరి రామకృష్ణ,చిత్రం శ్రీనివాస్,కర్నాటి యాదగిరి, సతీష్ కుమార్, తుంగతుర్తి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments