భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా మర్రిగూడెం బైపాస్‌లోని బుద్ధా గార్డెన్లో ఘనంగా నివాళులర్పించబడింది. ఈ కార్యక్రమం డా. బాబు జగ్జీవన్ రామ్ & డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జరిగింది.
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పున్న కైలాస్, BRS మాజీ MLA కంచర్ల భూపాల్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్లు బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మందడి సైదిరెడ్డి డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులు కత్తుల సహదేవ్, బొజ్జ నాగేష్ మాట్లాడుతూ మహనీయుల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని, రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ ఆలోచనలను యువతకు, విద్యార్థులకు తెలియజెప్పే విధంగా కొనసాగించాలని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించబడుతున్నట్లు, కమిటీ సహాయ సహకారంతో ముందుకు తీసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు.
స్థానిక కౌన్సిలర్లు బొజ్జ శంకరయ్య, ఉట్కూరి వెంకటరెడ్డి, ఏర్పుల రవి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బొర్ర సుధాకర్, MRPS నల్గొండ జిల్లా సీనియర్ నాయకులు, MSP జిల్లా అధ్యక్షులు బకరం శ్రీనివాస్ మాదిగ, MRPS & MSP నల్గొండ నియోజకవర్గ ఇన్చార్జ్ బొజ్జ దేవయ్య, BRS నాయకులు దేప వెంకటరెడ్డి, బొజ్జ వెంకన్న, బొజ్జ ఖతర్నాక్, దొడ్డి రమేష్, బీపంగీ కిరణ్, మరియు కమిటీ ప్రధాన సభ్యులు బొజ్జ గోపి, బొజ్జ కృష్ణయ్య, బొజ్జ లింగస్వామి, బొజ్జ చిట్టిబాబు, బొజ్జ నరసింహ, బీపంగి యాదయ్య, మేడి యాదగిరి, బొజ్జ పాండు, చిలుముల ప్రభాకర్, ఉపేందర్, లక్ష్మీనారాయణ తో పాటు వివిధ గ్రామాల ప్రజా సంఘ, కుల సంఘ, రాజకీయ నాయకులు హాజరై కార్యక్రమాన్ని ఘనంగా ముగించారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments