ePaper
Tuesday, March 17, 2026

విదేశాల్లో ఉన్నత విద్యకు ఉచిత IELTS శిక్షణ – బీసీ స్టడీ సర్కిల్

సాక్షి, హైదరాబాద్:

విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి కీలకమైన IELTS పరీక్షకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

IELTSలో మంచి మార్కులు సాధించిన అభ్యర్థులకు విదేశీ విశ్వవిద్యాలయాల్లో స్కాలర్‌షిప్‌లు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులు మరియు విదేశాల్లో చదవాలనుకునే అభ్యర్థులు ఈ శిక్షణకు హాజరు కావచ్చని పేర్కొన్నారు.

ఆసక్తి ఉన్న విద్యార్థులు డిసెంబర్ 1 నుంచి 21 వరకు బీసీ స్టడీ సర్కిల్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్లైన్‌లో దరఖాస్తు చేయాలని సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 బీసీ స్టడీ సర్కిల్ కేంద్రాలలో ఈ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు.

మరిన్ని వివరాలకు విద్యార్థులు బీసీ స్టడీ సర్కిల్ హెల్ప్‌లైన్‌ నంబర్‌కు సంప్రదించవచ్చని డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సూచించారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!