బీసీ విద్యార్థి జేఏసీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు
అయితగోని జనార్దన్ గౌడ్

ఈరోజు నల్లగొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో తెలంగాణ తొలి అమరుడు ఓయూ జెఎసి విద్యార్థి స్వర్గీయ కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని బీసీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా కాగడాలతో నివాళులర్పించడం జరిగింది బీసీ విద్యార్థి జేఏసీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి గారు. బడుగు బలహీన వర్గాల బతుకులు బాగుపడతాయని
స్వరాష్ట్ర స్వప్నం కోసం తనను తాను అగ్నికి ఆర్పణ చేసిన ఆయన మహోన్నత త్యాగం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.
ఆయన ఆత్మబలిదానం కోట్లాది ప్రజల్లో ఉద్యమ జ్వాలను రగిలించింది.
వారి వర్ధంతి సందర్భంగా కాసోజు శ్రీకాంతాచారి గారి అమర త్యాగానికి అశ్రునివాళులు
ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఉద్యమాలు చేస్తూ తెలంగాణ వస్తే తెలంగాణ ప్రజల కు అన్ని రంగాల్లో అవకాశాలు వస్తాయని అదేవిధంగా నీళ్లు నిధులు నియామకాలు నిరుద్యోగ యువకులకు విద్యా ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఉద్యమం చేసినటువంటి శ్రీకాంతాచారి ఆత్మబలిదానం చేసుకున్నాడు తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్న శ్రీకాంతచారిని వారి యొక్క కుటుంబానికి గత ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకార్ధాలు చేయలేదు కావున ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం శ్రీకాంతాచారి యొక్క జయంతి వర్ధంతిలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ సెల్ అధ్యక్షుడు దూదిగామ కిరణ్ కుమార్ జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి గజ్జి అజయ్ కుమార్ యాదవ్ కన్వీనర్ కర్నాటి యాదగిరి జేఏసీ పట్టణ అధ్యక్షుడు పుట్ట వెంకన్న గౌడ్ మార్గం సతీష్ కుమార్ చిలక రాజు సతీష్ కుమార్ అనంతు నాగరాజుగౌడ్ చెన్నోజు రాజు భాస్క సతీష్ యాదవ్ నేర్లకంటి సుధాకర్ కల్లూరి సత్యనారాయణ గౌడ్ చిరుబోయిన వెంకన్న యాదవ్ ఎల్లుట్ల సైదులు తదితరులు పాల్గొన్నారు
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments