నల్గొండ:
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించి పలు విభాగాలలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసూతి వార్డులో పురుషులు ఉండటం పట్ల ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రసూతి వార్డులో పురుషులను అనుమతించడం ఎలా జరిగిందని డ్యూటీ డాక్టర్‌ను ప్రశ్నించిన కలెక్టర్, వెంటనే వార్డులో ఉన్న పురుషులందరినీ బయటకు పంపాలని ఆదేశించారు. మహిళలకు ఎక్కువ మంది సహాయకులు ఉండటం వల్ల నవజాత శిశువులకు ఇన్ఫెక్షన్ రావచ్చని హెచ్చరించారు.
కేవలం ఒక్కరికి మాత్రమే అనుమతి ఇవ్వాలని స్పష్టంగా సూచించారు.
అదనంగా, కలెక్టర్ ఆసుపత్రిలోని ప్రసూతి, పిల్లల వార్డు, ఐసీయూ తదితర విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రి ఆవరణలో, గేటు వద్ద, వాహనాల పార్కింగ్ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలను కూడా తనిఖీ చేసి, అవన్నీ ఎప్పటికప్పుడు పనిచేసేలా చూడాలని ఆసుపత్రి వర్గాలను ఆదేశించారు. ఆటో నిలిపే ప్రాంతంలో సీసీ కెమెరాలు లేవని గుర్తించి వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు.
తనిఖీ సమయంలో ఆస్పత్రి సూపరింటిండెంట్ అరుణకుమారి, డాక్టర్ వందన, డాక్టర్ నగేష్ తదితరులు ఆమెతో ఉన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments