నల్లగొండ జిల్లా కేంద్రంలో “42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితి” పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాలలో భాగంగా ఈరోజు అంబేద్కర్ విగ్రహం వద్ద జిల్లా స్థాయి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కమిటీ ఆధ్వర్యంలో, జిల్లా చీఫ్ కన్వీనర్ నేలపట్ల చంద్రశేఖర్ ముందుండి నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ నేలపట్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ –
ఇటీవల ప్రకటించిన 42% BC రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న విధానం “రెండు కోట్ల మంది బీసీల జీవితాలతో ఆడుకుంటూ, వారిని అగ్నికి ఆహుతి చేస్తున్నట్టు ఉంద”ని విమర్శించారు. BC ల ఆత్మగౌరవాన్ని దిగజార్చే విధంగా ప్రభుత్వ వైఖరి ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అతను ఇంకా మాట్లాడుతూ –
“ముందు ‘BC ల కామారెడ్డి డిక్లరేషన్’ పేరుతో హామీలు ఇచ్చారు. తర్వాత స్థానిక సంస్థలు, విద్యా – ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. కానీ 9వ షెడ్యూల్లో చేర్పించేందుకు పోరాడకుండా, చట్టబద్ధత లేకుండా చేసిన అమలు లేని చట్టాలతో కోర్టుల ముందు BC ల పరువు తీశారు. BC ల నోట్లో ఈ ప్రభుత్వం మన్నుకొట్టింది” అని తీవ్రంగా విమర్శించారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments