బొట్టుగూడ ఉన్నత పాఠశాలకు నూతన భవనాన్ని నిర్మిస్తున్న మంత్రి కోమటి రెడ్డి ని ఘనంగా సన్మానించిన పూర్వ విద్యార్థులు : నల్గొండ పట్టణంలో అత్యంత ప్రాముఖ్యత చెందిన బొట్టుగూడ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నూతన భవన నిర్మాణాన్ని కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టడం పట్ల బొట్టుగూడ పాఠశాల పూర్వ విద్యార్థులు నేడు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ని నేడు హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలసి ఘనంగా సన్మానించారు. దాదాపు ఏడు దశాబ్దాల చరిత్ర గలిగి జాతీయ స్థాయి ఉత్త్తమ ఉపాధ్యాయులు, ఎందరో ప్రముఖ ఉపాధ్యాయులు బోధించిన బొట్టుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇన్నేళ్ళుగా ప్రయివేటు భవనంలో కొనసాగుతోంది. ఈ పాఠశాలకు శాశ్వత భవనం కావాలని మంత్రికి పూర్వ విద్యార్థులు విజ్ఞప్తి చేయగా ప్రకాశం బజార్ సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలంలో రూ. 8 కోట్ల వ్యయంతో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టారు. కార్పొరేట్ స్థాయి సౌకర్యాలతో డిజిటల్ క్లాసులు, కంప్యూటర్ విద్య, ఇంగ్లీష్ & ఉర్దూ మీడియం బోధనకు ప్రాధాన్యత ఇస్తూ నిర్మాణం చేపట్టారు. ఇందుకు కృతజ్ఞతగా, బొట్టుగూడ పాఠశాల పూర్వ విద్యారులైన నల్గొండ జిల్లా వక్ఫ్ బోర్డు ప్రసిడెంట్ హఫీజ్ ఖాన్, జీహెచ్ఎంసీ అడిషనల్ కమీషనర్ ఎన్. రఘుప్రసాద్, అడిషనల్ ఎస్.పి. పూర్ణ చందర్, సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ కన్నెకంటి వెంకట రమణ, అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ హలీం, గొట్టిపర్తి వేణుగోపాల్, ఏ. విశ్వేశ్వర్ రావు తదితరులు మంత్రి వెంకట రెడ్డిని కలసి ఘనంగా సన్మానించారు. కాగా, నూతనంగా నిర్మిస్తున్న బొట్టుగూడ పాఠశాల నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయని త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీద దీన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి కోమటి రెడ్డి వెల్లడించారు.

Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments