ఆరు వేల సర్పంచ్ స్థానాలు బీసీలవే.. జనరల్ స్థానాల్లో కూడా బీసీలు బరిలో నిలవాలి
బీసీ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న గడియారం సెంటర్లో బిసి మంత్రులు ,ఎమ్మెల్యేలు, ఎంపీలు ,ఎమ్మెల్సీలు ,తక్షణమే మీ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గాడిదలకు బ్యానర్లు కట్టి నిరసన ప్రదర్శన చేయడం జరిగింది బీసీ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ
బీసీలకు చట్టబద్దంగా ఇస్తామన్నా 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకపోగా, బీసీలను నమ్మించడానికి తమ పార్టీ పరంగా బీసీలకు 42 శాతం నుండి 60 శాతం వరకు జనరల్ స్థానాల్లో కూడా అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్, బిజెపి పార్టీలు ప్రకటించాయని, కానీ ఆచరణలో అమలు చేయడానికి కనీస కసరత్తు కూడా చేయడం లేదని ఆయన ఆరోపించారు బీసీలకు నిజంగానే రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం గతంలో తెచ్చిన జీవో నెంబర్ 9 ద్వారా బీసీలకు రాష్ట్ర వ్యాప్తంగా 5300 సర్పంచు స్థానాలను అన్ని జిల్లాలలో, వివిధ గ్రామాలను బీసీ లకు రిజర్వేషన్ చేసిందని, కనీసం ఈ ప్రతిపదిక అయిన బీసీలకు అవకాశం కల్పిస్తామని ఏ పార్టీ ప్రకటించడం లేదని , దీనిని బట్టి చూస్తే రాజకీయ పార్టీలు బీసీలను మోసం చేయడానికి ప్రకటనలు గుప్పిస్తారు తప్ప ఆచరణలో మాత్రం శూన్యమని ఆయన అన్నారు
అగ్రకుల రాజకీయ పార్టీల మోసాన్ని బీసీలు గ్రహించి బీసీలకు చట్టబద్ధంగా రావలసిన ఆరువేల గ్రామపంచాయతీలు బీసీల వేనని, జనరల్ కోట అంటే అగ్రకులాలకు రిజర్వేషన్ కాదని, బీసీ రిజర్వేషన్లను గండి కొట్టి బీసీ రిజర్వేషన్లకు రావలసిన గ్రామ సర్పంచ్ స్థానాలను జనరల్ గా మార్చరని, అందుకే జనరల్ స్థానాలు కూడా బీసీలు కైవసం చేసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా జనరల్ స్థానాలలో సర్పంచులుగా బీసీలు ఎన్నికల బరిలో నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు జనరల్ స్థానాలలో నిలబడిన బీసీలను గెలిపించుకునే బాధ్యత బీసీ సమాజం తీసుకుంటుందని, బీసీల రాజ్యాధికారానికి సర్పంచుల సీటే ప్రతిపదిక కావాలని ఆయన కోరారు
ఎన్నికల షెడ్యూల్ తో సంబంధం లేకుండా బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని, అందులో భాగంగా ఈ విధంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్లు చిలకరాజు సతీష్‌కుమార్,మార్గం సతీష్‌కుమార్, కన్వీనర్ కర్నాటి యాదగిరి, పట్టణ చైర్మన్, పుట్ట వెంకన్న గౌడ్, ప్రధాన కార్యదర్శి గజ్జి అజయ్ కుమార్ యాదవ్, జాయింట్ సెక్రటరీలు అనంత నాగరాజు గౌడ్, గడగోజు విజయ్,చెన్నోజు రాజు, దొడ్డు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments