📍 నల్లగొండ
TVAEJAC ఆధ్వర్యంలో విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు నిరవధిక నిరసన చేపట్టారు. డా. బీఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగబద్ధ హక్కుల సాధన కోసం, ఒకే సంస్థలో ఒకే రూల్ అమలు చేయాలని, బ్రిటిష్ కాలం నాటి నిబంధనలను రద్దు చేసి APSEB రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
నల్లగొండ నుండి నాల్గవ రోజు నిరవధిక సమ్మె భాగంగా ఖమ్మం జిల్లాలోని పాల్వంచ KTPS కు బయలుదేరిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి నల్లగొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
సుమారు 7 గంటల తర్వాత రాష్ట్ర JAC కో-చైర్మన్ చింత ఎల్లయ్య, కొప్పోలు రవివర్మ, రవి, లతీఫ్ తదితరులను పోలీసులు విడుదల చేశారు.
ఈ ఘటనపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశాయి.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments