📍 మునుగోడు / నల్గొండ
తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉమ్మడి నల్గొండ జిల్లా ఉద్యోగులు గౌరవ మునుగోడు ఎమ్మెల్యే శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని కలిసి ఆర్టిజన్ కార్మికుల సమస్యలను వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ, కార్మికుల డిమాండ్లు న్యాయమైనవని పేర్కొన్నారు. వాటిని ట్రాన్స్కో CMD మరియు విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారి దృష్టికి తీసుకెళ్లి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో JAC రాష్ట్ర నాయకులు చింత ఎల్లయ్య, జిల్లా చైర్మన్ జిట్టబోయిన లింగస్వామి యాదవ్, కన్వీనర్ మద్ది శ్రీనివాస్ యాదవ్, కోశాధికారి విశ్వం, జిల్లా నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, రమేష్, వేణుగోపాల్ రెడ్డి, పెరికా శేఖర్, మల్లేష్, ఉత్తం తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments