ప్రజలు సహజ వైద్య విధానాల వైపు మళ్లేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను సూచించారు ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా శుక్రవారం అయన ప్రభుత్వ కేంద్ర ఆసుపత్రి లో నిర్వహించిన హోమియోపతి డే సందర్భంగా ప్రభుత్వ ఆయుర్వేద, యునాని, హోమియోపతి విభాగాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. హోమియోపతి పితామహుడు డాక్టర్ సామ్యూల్ హానీమన్ చిత్రపటానికి పూలమాల అర్పించి నివాళులు ఘటించారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక లో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఇందులో భాగంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. హోమియోపతి నర్సింగ్ విద్యార్థులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, బయట తినుబండారాలను తగ్గించి, శుభ్రమైన మరియు పోషకాహారం, తాజా పండ్లు తీసుకోవాలని సూచించారు.
నర్సింగ్ విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే ఇతరులకు సేవ చేయగలుగుతారని , వైద్య వృత్తిలో ఉన్నవారు ఆరోగ్యంగా ఉండటం అత్యంత అవసరమని తెలిపారు.
అలాగే గతంలో క్యాన్సర్, ప్లేగు వంటి వ్యాధులకు సరైన చికిత్సలు లేక ప్రజలు ప్రాణాలు కోల్పోయేవారని, ప్రస్తుతం వైద్య రంగంలో ఎంతో అభివృద్ధి జరిగిందని తెలిపారు. అయితే సైడ్ ఎఫెక్ట్స్ లేని ఆయుర్వేద, యునాని, హోమియోపతి వైద్య విధానాలపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు.. విద్యార్థులు నిత్యం వ్యాయామం, యోగా, జిమ్ వంటి ఆరోగ్యకరమైన అలవాట్లు అలవర్చుకోవాలని సూచించారు.
కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించి, వైద్య శిబిరం ద్వారా అందిస్తున్న సేవలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డిఎంహెచ్వో వేణుగోపాల్ రెడ్డి, యునాని వైద్య అధికారి డాక్టర్ ముబీన్ పర్వీన్, ప్రోగ్రాం ఇన్చార్జ్ సుహాసిని,
డిప్యూటీ సూపరింటెండెంట్ గణేష్ ,తదితరులు, హాజరయ్యారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments