నల్లగొండ, ఏప్రిల్ 06: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని నల్లగొండ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు డా. నాగం వర్షిత్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు.

జిల్లా వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. కార్యక్రమంలో భాగంగా పార్టీ స్థాపకులు మరియు ప్రముఖ నాయకుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా డా. నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ, డా. శ్యామప్రసాద్ ముఖర్జీ ఆశయాలతో ప్రారంభమైన పార్టీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రవచించిన ఏకాత్మ మానవతావాదం సిద్ధాంతంతో ముందుకు సాగుతోందన్నారు. మాజీ ప్రధానమంత్రులు అటల్ బిహారి వాజపేయ్, లాల్ కృష్ణ ఆడ్వాణీ వంటి అగ్రనేతలు పార్టీ నిర్మాణానికి విశేష కృషి చేశారని గుర్తుచేశారు.
“సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్” నినాదంతో, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని తెలిపారు. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి పథకాల ద్వారా భారత్ ప్రపంచ వేదికపై ప్రత్యేక స్థానం సంపాదించిందన్నారు.
బీజేపీ సిద్ధాంతాలు అయిన జాతీయత, సుశాసనం, అభివృద్ధి ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్నాయని పేర్కొన్నారు. అంత్యోదయ స్ఫూర్తితో సమాజంలోని చివరి వ్యక్తికి ప్రయోజనం చేకూర్చడం పార్టీ లక్ష్యమని చెప్పారు.
ఈ ఆవిర్భావ దినోత్సవం పార్టీ చరిత్రను గుర్తు చేసే రోజు మాత్రమే కాకుండా, దేశ అభివృద్ధికి తమ కట్టుబాటును పునరుద్ఘాటించే సందర్భంగా కూడా నిలుస్తుందని తెలిపారు. కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments