నల్గొండ: చండూర్ పట్టణంలో బీజేపీ కార్యకర్తలపై కాంగ్రెస్‌కు చెందిన వ్యక్తులు దాడి చేసిన ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. అలాగే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ రోజున బీజేపీ జిల్లా అధ్యక్షుడిపై దాడి చేసిన డీఎస్పీ శివరాం రెడ్డి గారిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదే సందర్భంలో ఉగాది పండుగ సందర్భంగా నల్గొండ పట్టణంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అర్ధరాత్రి సమయంలో తొలగించి కాంగ్రెస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని నల్గొండ జిల్లా ఎస్పీ శ్రీ శరత్ చంద్రకుమార్ గారిని బీజేపీ నాయకులు కలిసి ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదును బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు డా. నాగం వర్షిత్ రెడ్డి, జిల్లా ఇంచార్జి ఉదయ్ ప్రతాప్ సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాశం శ్రీనివాస్ రెడ్డి, అరవింద్ రెడ్డి, పిన్నింటి నరేందర్ రెడ్డి, శాంతిస్వరూప్ తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments