రేషన్ డీలర్ల సమస్యలపై ఎంపీ రఘువీర్ రెడ్డి కి వినతి
తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా రేషన్ డీలర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి వెంటనే పరిష్కరించాలని నలగొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డికి జిల్లా రేషన్ డీలర్ సంఘం ఆధ్వర్యంలో శనివారం వినతిపత్రం అందజేశారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా17200 మందికి పైగా రేషన్ డీలర్లు పనిచేస్తున్నారని ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను రేషన్ కార్డు దారులకు పంపిణీ చేస్తూ ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్నామని, గోదాముల నుండి రేషన్ షాపులకు వచ్చే సరుకులు సరైన తూ కాలు లేకుండా ఇవ్వడం వల్ల రేషన్ డీలర్లు ఆర్థికంగా నష్టపోతున్నారని ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం వచ్చే సరుకులకు హమాలీ ప్రభుత్వమే భరించాలని ఇప్పటికీ రేషన్ డీలరే భరిస్తున్నాడని, కాంగ్రెస్ మేనిఫెస్టో లో ప్రభుత్వంలో రేషన్ డీలర్లకు 5000 గౌరవ వేతనం ప్రతి కింటకు 3 వందల చొప్పున కమిషన్ ఇస్తామని ఇప్పటివరకు నెరవేర్చలేదని వాటిని వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని తెలిపారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర కోశాధికారి, జిల్లా అధ్యక్షుడు పారేపల్లి నాగరాజు, కార్యదర్శి వైద్యుల సత్యనారాయణ, రాజా రమేష్, బొల్లా వేణుగోపాలరావు, సముద్రాల యాదయ్య పాల్గొన్నారు
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments