ePaper
Friday, March 6, 2026

తిప్పర్తి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థినులతో మాట్లాడిన కలెక్టర్ వారి చదువు స్థాయిపై ప్రశ్నలు అడిగి, పరీక్షలకు ఎలా సిద్ధమవుతున్నారో తెలుసుకున్నారు. గత ఏడాది విద్యార్థినులు సాధించిన 563 మార్కులను గుర్తుచేసి, ఈసారి అంతకంటే ఎక్కువ మార్కులు సాధించాలని ప్రోత్సహించారు.

దీనికి స్పందించిన పది మంది విద్యార్థినులు 563 కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటామని ధైర్యంగా చెప్పడంతో కలెక్టర్ వారిని అభినందించారు. పరీక్షలకు భయపడకుండా ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో రాయాలని సూచించారు.

అలాగే హాస్టల్‌లో ఉన్న దోమల సమస్య, బెంచీలు, మూత్రశాలలు మరియు ఇతర సౌకర్యాల గురించి విద్యార్థినులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. హాస్టల్‌లో అందిస్తున్న మెనూ గురించి కూడా విచారించారు.

తర్వాత విద్యార్థినులతో కలిసి నేలపై కూర్చొని భోజనం చేసి వారితో సమయం గడిపారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట మండల తహసిల్దార్, ఎంపీడీవో, ఎంఈఓ తదితర అధికారులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!