ePaper
Friday, March 6, 2026

ప్రజల వద్దకే వెళ్లి ఫిర్యాదులు స్వీకరిస్తున్న నల్లగొండ పోలీసులు

నల్లగొండ పట్టణంలోని పద్మా నగర్ కాలనీలో మైనర్ బాలిక కిడ్నాప్ ఘటనపై 100 నంబర్‌కు సమాచారం అందింది.

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాలతో వెంటనే స్పందించిన పోలీసులు సంఘటనపై తక్షణ చర్యలు చేపట్టారు.

ఫిర్యాదుదారు పోలీస్ స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేకుండా నేరుగా ఇంటి వద్దకే చేరుకున్న టూ టౌన్ పోలీసులు బాధితుల వద్దే ఫిర్యాదు స్వీకరించారు.

అనంతరం కేసు నమోదు చేసి, ఎఫ్‌ఐఆర్ ప్రతిని ఫిర్యాదుదారునికి అందజేశారు టూ టౌన్ ఎస్సై వై సైదులు.

ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు.

బాలికను త్వరితగతిన గుర్తించి కేసును ఛేదిస్తామని బాధితులకు టూ టౌన్ పోలీసులు భరోసా ఇచ్చారు.

ప్రజలకు తక్షణ సేవలు అందించడంలో నల్లగొండ పోలీసుల వేగవంతమైన చర్యలు ప్రశంసలు పొందుతున్నాయి.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!