కేతేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. జల్సా కోసమే బైక్ దొంగతనాలు చేస్తున్నారని విచారణలో వెల్లడైంది. వాహన తనిఖీల సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన వారిని అదుపులోకి తీసుకొని విచారించగా పలు నిజాలు బయటపడ్డాయి.

అదనపు ఎస్పీ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం, నిందితుల నుంచి సుమారు రూ.7 లక్షల విలువైన 8 ద్విచక్ర వాహనాలు మరియు 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారిలో ఇద్దరు విద్యార్థులు, ఇద్దరు బాల నేరస్తులు (జువైనైళ్లు) ఉన్నట్లు తెలిపారు.
వీరు పలు ప్రాంతాల్లో బైక్ దొంగతనాలకు పాల్పడ్డారని విచారణలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో మరింత దర్యాప్తు కొనసాగుతోందని, ఇలాంటి నేరాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు ఎస్పీ హెచ్చరించారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments