రూ.2,200 కోట్లతో మున్సిపల్ కార్పొరేషన్లో అభివృద్ధి పనులు
నల్గొండ:
నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌కు అధిక నిధులు తీసుకొచ్చి మరింత అభివృద్ధి చేస్తానని రాష్ట్ర రోడ్లు & భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
ఆదివారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పలువురు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లను మంత్రి ప్రకటించారు. ఈ సందర్భంగా 6వ డివిజన్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టి, 25, 41, 19 డివిజన్లలో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అలాగే ట్రాక్టర్ నడిపి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఫిబ్రవరిలో జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నల్గొండలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలన్నారు. మున్సిపల్ కార్పొరేషన్‌లోని 48 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని తెలిపారు.
“నల్గొండ మున్సిపాలిటీని అభివృద్ధి చేసింది నేనే.. ఇక చేసేదీ నేనే” అని మంత్రి స్పష్టం చేశారు.
తనను ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన నల్గొండ ప్రజల రుణం తీర్చుకోలేనిదని, పేదలకు ఏ ఆపద వచ్చినా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధిలో విఫలమైందని, ఆ పార్టీని ప్రజలు ఇప్పటికే తిరస్కరించారని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి వేగవంతమైందని తెలిపారు.
నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రస్తుతం రూ.2,200 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా మార్చడంతో మరింత అభివృద్ధి జరుగుతుందని చెప్పారు.
అన్ని డివిజన్లను సమస్యలేని కాలనీలుగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.
ఇప్పటికే కోట్లాది రూపాయలతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ల పనులు జరుగుతున్నాయని,
అన్ని డివిజన్లలో ప్రతిరోజూ తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల అభివృద్ధికి పెద్దపీట వేసిందని, మహిళా సంఘాలకు పావలా వడ్డీ రుణాలు అందిస్తూ వారి ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే పలుచోట్ల పెట్రోల్ బంకులు, రైస్ మిల్లులు మహిళా సంఘాలకు కేటాయించామని మంత్రి వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా. ఎం.ఏ. హఫీజ్ ఖాన్, నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ పాశం రామ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, డీసీసీబీ మాజీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు జూలకంటి శ్రీనివాస్, కర్నాటి కరుణాకర్ రెడ్డి, కేసాని వేణుగోపాల్ రెడ్డి, గోగుల గణేష్, లోకేశ్వరి రెడ్డి, కత్తుల వెంకట్, విక్రమ్ రెడ్డి, అన్వర్, ఎండి హఫీజ్, అఙ్గర్, మేడోజు శ్రీనివాస్, జగల్ రెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments