ePaper
Tuesday, March 17, 2026

శోభాయమానంగా రామలింగేశ్వరుడి నగరోత్సవం

– స్వామి ఊరేగింపును ప్రారంభించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నల్లగొండ జిల్లా:

నార్కెట్‌పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలోని శ్రీశ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని, స్వామివారి నగరోత్సవం శుక్రవారం నల్లగొండ పురవీధులలో భక్తిశ్రద్ధలతో శోభాయమానంగా జరిగింది.

జిల్లా కేంద్రంలోని రామాలయం ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంపై స్వామి–అమ్మవార్లను ఆశీనులుగా చేసి పూజలు నిర్వహించారు. అనంతరం ఊరేగింపు పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగింది.

ఈ కార్యక్రమానికి నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరై నగరోత్సవాన్ని ప్రారంభించారు. ఆయన భజన కార్యక్రమంలో కూడా పాల్గొని భక్తులతో కలిసి స్వామివారిని కీర్తించారు.

ఈ కార్యక్రమంలో డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, ఆలయ ఈవో, నల్గొండ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, నార్కెట్‌పల్లి మండల అధ్యక్షుడు బత్తుల ఉషయ్య, చెర్వుగట్టు సర్పంచ్ నేతగాని కృష్ణ, తదితరులు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో భక్తులు హాజరై నగరోత్సవాన్ని తిలకించారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!