నల్లగొండ, జనవరి 23 :
తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ (టీపిహెచ్‌డీఏ) ఆధ్వర్యంలో రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్, డైరీలను శుక్రవారం స్థానిక టీఎన్‌జీవో భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఘనంగా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కత్తి జనార్దన్ రెడ్డితో పాటు ఇతర జిల్లా నాయకులు క్యాలెండర్, డైరీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు సమయపాలన పాటిస్తూ గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు.
అలాగే కష్టపడి పనిచేస్తూ తమ హక్కుల సాధన కోసం పోరాడాలని, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ నరసింహారావు, డిప్యూటీ డీఎంహెచ్వోలు వేణుగోపాల్ రెడ్డి, రాహుల్ దీపక్, జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, డీఐఓ పద్మ,
జిల్లా అధ్యక్షుడు ఉబ్బు నరసింహ, కార్యదర్శి డాక్టర్ శైలి, కోశాధికారి షేక్ మొయిద్, ప్రచార కార్యదర్శి డాక్టర్ శ్రీదేవి, అలాగే నల్గొండ జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments