నల్లగొండ:
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కొత్త కమిషనర్‌గా శరత్‌చంద్ర అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం కమిషనర్ శరత్‌చంద్ర మాట్లాడుతూ, నల్లగొండ నగర అభివృద్ధికి కృషి చేస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా పని చేస్తానని తెలిపారు. పారిశుధ్యం, త్రాగునీరు, రహదారులు, పట్టణ సౌకర్యాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు, కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments