హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్ర శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్స్, సూపర్వైజర్స్ – SPS మెడికల్ & హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాదులో తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, శాసనమండలి సభ్యురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్స్, సూపర్వైజర్లు కలిపి సుమారు 17,000 మంది కార్మికులు తక్కువ వేతనాలతో, ఉద్యోగ భద్రత లేకుండా అనేక ఒడిదుడుకుల మధ్య కుటుంబాలను పోషిస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ సందర్భంగా ఆమె దృష్టికి తీసుకువచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ నెల నుంచి ఔట్సోర్సింగ్ & కాంట్రాక్ట్ కార్మికులకు IFMS విధానం ద్వారా డైరెక్ట్ జీతాలు చెల్లించేందుకు చర్యలు చేపడుతున్నప్పటికీ, SPS వ్యవస్థలో పనిచేస్తున్న 17,000 మంది కార్మికులను ఈ విధానంలో చేర్చలేదని రాష్ట్ర కమిటీ అధ్యక్షులు కుర్రి సైదయ్య గారు వివరించారు.
కార్మికుల ప్రధాన డిమాండ్లు:
ప్రతి కార్మికుడికి కనీస వేతనం ₹26,000/- చెల్లించాలి ప్రతి కార్మికుడిని IFMS విధానంలో చేర్చి ఉద్యోగ భద్రత కల్పించాలి వేతనాలను నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలి మహిళా కార్మికులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలి డబుల్ పీఎఫ్ రద్దు చేసి సింగిల్ పీఎఫ్ మాత్రమే కట్టాలి ప్రతి కార్మికుడికి ఈఎస్ఐ తప్పనిసరిగా కట్టి కార్డు ఇవ్వాలి డ్యూటీ సమయంలో లేదా ప్రయాణంలో ప్రమాదంలో మరణిస్తే రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలి ప్రమాదంలో మృతి చెందిన కార్మికుడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలి
ఈ డిమాండ్లతో కూడిన మెమోరాండాన్ని SPS మెడికల్ & హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కవిత గారికి అందజేశారు.
కార్మికుల సమస్యలను శ్రద్ధగా విన్న కల్వకుంట్ల కవిత గారు, ఈ అంశాలపై సంబంధిత శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో స్వయంగా మాట్లాడి, SPS కార్మికులను IFMS విధానంలో చేర్చేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో
రాష్ట్ర అధ్యక్షులు కుర్రి సైదయ్య,
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్న బోస్క నరేష్,
రాష్ట్ర ఉపాధ్యక్షులు మాతంగి అనిల్ కుమార్,
రాష్ట్ర సహాయ కార్యదర్శి గొర్రె నాగరాజు,
ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments