ePaper
Monday, March 16, 2026

కాంగ్రెస్ పార్టీ 5వ డివిజన్ ఇంచార్జి, కాబోయే కార్పొరేటర్ కంచర్ల ఆనంద్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

డాక్టర్ అగర్వాల్ కంటి హాస్పిటల్ వారి సహకారంతో, కాంగ్రెస్ పార్టీ 5వ డివిజన్ ఇంచార్జి మరియు కాబోయే డివిజన్ కార్పొరేటర్ కంచర్ల ఆనంద్ రెడ్డి ఆధ్వర్యంలో నల్లగొండ మహిళా ప్రాంగణం వద్ద కాలనీ ప్రజల కోసం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబడింది.

ఈ సందర్భంగా కంచర్ల ఆనంద్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గతంలో దుర్గ కాలనీలో కూడా డాక్టర్ అగర్వాల్ కంటి హాస్పిటల్ సహకారంతో కంటి వైద్య శిబిరం నిర్వహించినట్లు గుర్తు చేశారు. పేద ప్రజల సంక్షేమం కోసం భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి జక్కల లలిత, యాదగిరి, వెంకన్న, జీవన్, జలంధర్, నిఖిల్ గౌడ్, సందీప్, సంజయ్, కృష్ణతో పాటు మహిళా ప్రాంగణం ప్రాంత ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!