తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్, నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించే 2025-26 సంవత్సరానికి ఐదు (5) నెలల ఫౌండేషన్ కోర్సును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ ఫౌండేషన్ కోర్సు కరపత్రాలను జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర షెడ్యూల్డు కులాల స్టడీ సర్కిల్, నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించే 2025-26 సంవత్సరానికి ఐదు (5) నెలల ఫౌండేషన్ కోర్సును (రాష్ట్రస్థాయి అన్ని పోటీ పరీక్షలతో పాటుగా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కొరకు బ్యాంకింగ్, ఆర్.ఆర్ బీ, ఎస్.ఎస్.సీ అన్ని ఇతర పోటీ పరీక్షలు) లకు శిక్షణ తో పాటు భోజన వసతి సౌకర్యాలతో పాటు స్టడీ మెటీరియల్స్ అందిస్తున్నట్లు తెలిపారు.
జిల్లాకు చెందిన అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగ స్త్రీ/పురుష అభ్యర్థులు ఆన్లైన్లో http://tsstudycircle.co.in ఈ నెల 30-01-2026 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
అన్ని వర్గాల అభ్యర్థులు కనీసం ఏదైనా జనరల్ లేదా ప్రొఫెషనల్ కోర్సులలో డిగ్రీ పూర్తి చేసిన వారై ఉండాలని, వార్షిక ఆదాయం మూడు లక్షలలోపు ఉండాలని తెలిపారు. కళాశాలల్లో అడ్మిషన్ కలిగి, చదువు కొనసాగిస్తున్న వారు, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు గాని దరఖాస్తు చేసుకోవద్దని స్పష్టం చేశారు. ప్రవేశ పరీక్ష 08-02-2026 రోజున నిర్ణీత సెంటర్ నందు ఆఫ్ లైన్ ద్వారా ఉ.11.00 గం. నుండి మ.1.00 గంటల వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వంద మంది అభ్యర్ధులకు తేది:20-02-2026 నుంచి 19-07-2026 వరకు ఉచిత రెసిడేన్షియల్ కోచింగ్ ఇస్తారని తెలిపారు.
ఇతర వివరాలకు డైరెక్టర్ స్టడీ సర్కిల్ ఫోన్ నెంబర్ 9396621492 లో సంప్రదించాలని సూచించారు.
జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ అధికారి బి శశికళ, షెడ్యూల్ద్ కులముల అభివృద్ధి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస రావు , హౌస్సింగ్ పి. డి రాజ్ కుమార్ , సూపరిoడెంట్ సుధీర్ కుమార్ , ఎస్సి కార్పొరేషన్ సుపెరిండెంట్ గోవర్ధన్ రెడ్డి , దేవరకొండ ఎ ఎస్ డబ్ల్యూ కరుణ శ్రీ , ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ పి . నవీన్ కుమార్ తదితరులు ఉన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments