రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియలో భాగంగా చౌటుప్పల్ పురపాలక సంఘం పరిధిలోని డ్రాఫ్ట్ పోలింగ్ స్టేషన్ల (నమూనా ఓటు వినియోగ కేంద్రాలు) వివరాలను కమిషనర్ జి. వెంకట్రాం రెడ్డి గారు విడుదల చేశారు.
ఈ కార్యక్రమం 13-01-2026 మంగళవారం ఉదయం 11:50 గంటలకు చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయం నందు నిర్వహించబడింది. ఈ సందర్భంగా కమిషనర్ గారు డ్రాఫ్ట్ పోలింగ్ స్టేషన్ల జాబితాను అధికారికంగా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, రిటర్నింగ్ ఆఫీసర్ అంజయ్య, సీనియర్ అసిస్టెంట్ దీప రఘుపతి, వార్డ్ అధికారులు, బిల్ కలెక్టర్లు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రానున్న ఎన్నికలను పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు ఈ ప్రక్రియ కీలకమని కమిషనర్ తెలిపారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments