నల్గొండ: వివేకానందుని బోధనలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్, నల్గొండ ఆర్డీఓ వై. అశోక్ రెడ్డి పిలుపునిచ్చారు.
జాతీయ యువజన దినోత్సవం, స్వామి వివేకానంద 164వ జయంతిని పురస్కరించుకొని సోమవారం ఆయన అదనపు ఎస్పీ రమేష్‌తో కలిసి నల్గొండ జిల్లా కేంద్రంలోని స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ స్వామి వివేకానంద భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారని అన్నారు. అమెరికా, ఇంగ్లాండ్ వంటి దేశాలలో తన బోధనల ద్వారా భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేశారని గుర్తు చేశారు. ఆయన సందేశాలకు ఆకర్షితులైన యువత ఇప్పటికీ ఆయన బోధనలను ఆచరిస్తూ ముందుకు సాగుతున్నారని తెలిపారు. జాతి నిర్మాణంలో స్వామి వివేకానంద స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
అదనపు ఎస్పీ రమేష్ మాట్లాడుతూ నేటి యువతకు స్వామి వివేకానంద బోధనలు అత్యంత స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడలు, యువజన సర్వీసుల శాఖ అధికారి మీర్ అక్బర్ అలీ, సమాచార శాఖ సహాయ సంచాలకులు యు. వెంకటేశ్వర్లు, తహసీల్దార్ పరుశురాం, మాజీ జెడ్పిటిసి గుమ్మల మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments