e-paper
Thursday, January 29, 2026

పెండింగ్ రెవెన్యూ దరఖాస్తుల పరిష్కారానికి వేగం పెంచాలి

జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశాలు

రెవెన్యూ అధికారులు అంకితభావంతో, చిత్తశుద్ధితో పనిచేసి ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని సూచించారు.

బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో రెవెన్యూ అంశాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. భూ భారతి, భూ రికార్డులు, భూమి వివాదాలు, రెవెన్యూ సదస్సుల్లో సాదా బైనామాలపై వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

ప్రతి మండలంలో పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను క్రమం తప్పకుండా సమీక్షించాలని, భూ సంబంధిత వ్యవహారాలలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. అసైన్డ్ భూములకు సంబంధించిన పెండింగ్ సమస్యలను కూడా త్వరగా పరిష్కరించాలని సూచించారు.

విద్యార్థుల ఉపకార వేతనాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కుల, ఆదాయ ధ్రువపత్రాలను వెంటనే జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళలను కోటీశ్వరులుగా చేసే కార్యక్రమంలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి ఒక పెట్రోల్ బంకు ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థలాల గుర్తింపుపై చర్యలు తీసుకోవాలని చెప్పారు.

ఓటరు మ్యాపింగ్ ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు 61 శాతం పనులు పూర్తయ్యాయని, దీనిని 75 శాతానికి పెంచేందుకు ప్రతిరోజూ బీఎల్ఓలతో సమీక్షలు నిర్వహించాలని సూచించారు.

రెవెన్యూ అధికారులు అందరూ అంకితభావంతో, చిత్తశుద్ధితో పెండింగ్ పనులను పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కృషి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఈ సమీక్ష సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ఆర్డీవోలు, తహసిల్దార్లు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!