సిపిఎం జిల్లా విసృత సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

ప్రజా పోరాటాతోనే పార్టీ బలోపేతం అవుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఏం ఎస్ గార్డెన్ లో సిపిఎం పార్టీ జిల్లా విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న జాన్ వెస్లీ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని, ముఖ్యంగా ప్రజల్లో రాజకీయ చైతన్యం కల్పించాలని కోరారు. దోపిడికి భూస్వామ్యులకు వ్యతిరేకంగా పోరాటాలు జరుపుతున్న సిపిఎం పార్టీ అని అన్నారు. ఎవరు ఏమనుకున్నా పేద ప్రజల కోసం పనిచేసే పార్టీ ఏకైక పార్టీ ఎర్రజెండా అన్నారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ప్రజా ఉద్యమాలు నడిపించే నాయకులకు ప్రజలు ఎప్పుడు అండగా ఉంటారని చెప్పారు. గత సర్పంచ్ ఎన్నికల్లో అన్ని పార్టీలు ఏకమై కమ్యూనిస్టు నాయకులను ఓడించారని చూసిన ప్రజల అండతో అనేకచోట్ల గెలిచారని గుర్తు చేశారు. డబ్బు, మద్యంతో మభ్యపెట్టిన నిజమైన ప్రజా నాయకులకు గెలిపించారని చెప్పారు. పదవులు ముఖ్యంగా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలన్నారు. రాష్ట్రంలో, దేశంలో పేదవారికి అన్యాయం చేసే విధంగా విధానాలు తీసుకొస్తున్నారని వీటిని తిప్పుకొట్టేందుకు ప్రజా ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ విధానాలతో దేశాన్ని కొల్లగొడుతున్నారని ఆరోపించారు. ప్రజలకు చెందాల్సిన సంపద బడా బాబులకు దోచిపెడుతున్నారని విమర్శించారు. వాటిని కాపాడుకునేందుకు దేశవ్యాప్తంగా బలమైన పోరాటాలు చేయాలన్నారు. ఉద్యమాలకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు నిలవాలన్నారు. ప్రపంచంలో కమ్యూనిజన్నీ అంతం చేసేందుకు అమెరికా కుట్రలు పన్నుతున్నదని ఆరోపించారు.. ప్రపంచంలో తమ పెత్తనం చెలాయించేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నాడని చెప్పారు. అందులో భాగంగా వెనిజులా అధ్యక్షులు మదురో దంపతులను అమెరికా సామ్రాజ్యవాదం అరెస్ట్ చేసిందని అవేదన వ్యక్తం చేశారు. అమెరికా సామ్రాజ్యవాద దురాక్రమలను తిప్పికొట్టాలన్నారు
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రo లో అప్పులు చేసి దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసేందుకు బలమైన ప్రజా పోరాటాలు చేయాలన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన బి ఆర్ ఎస్ అధినేత అసెంబ్లీలో ఉండకపోవడం సరినది కాదన్నారు. రాష్టానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు అసెంబ్లీ వేదికను ఉపయోగించాలన్నారు. ప్రభుత్వము ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఉద్యమాలు జరపాల్సిన బాధ్యత ప్రతిక్షాలకు ఉందన్నారు. దేశంలో భూతులు తిట్టుకోవడంలో రాష్ట్రo నంబర్ వన్ గా ఉందన్నారు. ప్రజా సమస్యలు గాలికి వదిలేసి బూతులు తిట్టుకుంటూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. కవిత బి ఆర్ ఎస్ ను విడిపోయి గత ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాల పై ఆరోపణలు చేస్తుందని చెప్పారు. ఇలాంటి పార్టీలకు బుద్ధి చెప్పడంతో పాటు సిపిఎం విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్ళునేందుకు ప్రజా ఉద్యమాలు చేయాలన్నారు. భవిష్యత్ దేశానికి కమ్యూనిస్టులు అవసరమన్నారు. స్థానిక సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. నిత్యం ప్రజల్లో ఉండి ప్రజా అభిమానం గెలుచుకోవాలన్నారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో బలమైన ప్రజా ఉద్యమాలు చేసి జిల్లాను ముందు బాగాన ఉంచుతామని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. ఎస్ఎల్బీసీకి నిధులు కేటాయించి వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. డిండి ప్రాజెక్టు పూర్తి చేయాలని, లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వేగవంతం చేసినందుకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రానున్న రాష్ట్ర బడ్జెట్లో జిల్లా అభివృద్ధి సంక్షేమం కోసం నిధులు కేటాయించాలని కోరారు.
అనంతరం నూతనంగా ఎన్నికైన సిపిఎం సర్పంచులు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులకు శాలువాతో సన్మానించారు.
సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, నారి ఐలయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీశైలం, నాగార్జున, ప్రమీల, ప్రభావతి, లక్ష్మీనారాయణ, వీరేపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments