మాజీ మున్సిపల్ చైర్మన్, బుర్రి శ్రీనివాస్ రెడ్డి.
నలగొండ, జనవరి 4.
వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేద ప్రజలు ఖరీదైన వైద్యం చేయించుకోలేని పరిస్థితిలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం వలన వారికి ఎంతో ఉపయోగపడతాయని మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండ పట్టణంలోని రాక్ హిల్స్ కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిమ్స్ రివర్స్ ఆసుపత్రి సహకారంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తరచూ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం వలన పేదలు తమలో ఉన్న అనారోగ్య సమస్యలను తెలుసుకోవడమే కాకుండా చికిత్స పొంది పూర్తి ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించిన రాఖిల్స్ కమిటీని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా నిమ్స్ రివర్స్ ఆసుపత్రి డాక్టర్లు వెంకట్ రెడ్డి, డాక్టర్ కీర్తి,డాక్టర్ వీరారెడ్డిలు, వైద్య శిబిరంలో ఉచిత పరీక్షలు నిర్వహించి వివిధ అనారోగ్య సమస్యలకు మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సోమనబోయిన నరసింహ, గౌరవాధ్యక్షుడు పకీర్ వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగబాబు, కోశాధికారి,కాలనీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments