చక్ర హరి రామరాజు జిల్లా అధ్యక్షుడు బీసీ సంక్షేమ సంఘం
ఈరోజు పట్టణంలో జ్యోతిబాపూలే సెంటర్ వద్ద శ్రీమతి సావిత్రిబాయి పూలే 195వ జయంతి ఉత్సవాలను చక్రహరి రామరాజు గారు జిల్లా అధ్యక్షుడు బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. శ్రీమతి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కుల సంఘాల నాయకులు, విద్యార్థి నాయకులు మేధావులు, ప్రజాసంఘాల నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. వీరిని ఉద్దేశించి చక్రహరి రామరాజు గారు మాట్లాడుతూ 195 సంవత్సరాల క్రితం మూఢనమ్మకాలు, సాంఘిక దురాచారాలు సమాజాన్ని శాసిస్తున్న సమయంలో శ్రీమతి సావిత్రిబాయి పూలే వారి భర్త జ్యోతిబాపూలే అడుగుజాడల్లో నడుస్తూ, సమాజానికి విద్య ద్వారానే మార్పు వస్తుందని, ఆ మార్పు ఆకాశంలో సగభాగమైన మహిళలకు విద్య నేర్పుట ద్వారా సమాజం సంపూర్ణంగా సఫలీకృతమవుతుందని భావించి ఆ రోజుల్లో ఎన్నో అవమానాలకు తట్టుకొని తన భర్త దగ్గర విద్యను అభ్యసించి తానే స్వయంగా ఉపాధ్యాయినిగా మారి బాలికలను చేర దీసి చదువు చెప్పుతూ దేశంలోనే మొట్టమొదటిసారిగా 48 బాలిక పాఠశాలలను నెలకొల్పి అట్టడుగు వర్గాల ప్రజలకు ముఖ్యంగా మహిళలకు విద్యను అందించిన భారత దేశపు మొట్ట మొదటి ఉపాధ్యాయురాలని అన్నారు. ఆమె అంకితభావాన్ని గుర్తించిన బ్రిటిష్ ప్రభుత్వం బాంబే ప్రెసిడెన్సీ లో ఉత్తమ ఉపాధ్యాయురాలుగా సన్మానించడం జరిగింది.
సావిత్రిబాయి పూలే సత్యశోధక సమాజం లో భాగస్వామి అయి బ్రాహ్మణీయ భావజాలాన్ని వ్యతిరేకిస్తూ బ్రాహ్మణులు లేకుండా వివాహాలు జరిపించినటువంటి మొట్టమొదటి సంఘసంస్కర్త సావిత్రిబాయి పూలే అన్నారు. భర్త చనిపోయిన మహిళలను చిన్నచూపు చూస్తూ సమాజంలో అంటరాని వారిగా భావిస్తూ వారికి తగిన గౌరవం ఇవ్వని పరిస్థితులలో ఆమె తన ఇంటి వద్ద మహిళా ఆశ్రమాలను పెట్టి భర్త చనిపోయిన మహిళలకు ఆశ్రమం కల్పించారు. బాల్య వివాహాలను వ్యతిరేకిస్తూ సమాజంలో పెను మార్పుకు కారణమయ్యారని అన్నారు .
మహిళా హక్కులే సమాజానికి సంపూర్ణమైన స్వేచ్ఛని ప్రజాస్వామ్యానికి ఆయు పట్టుఅని నినదించిన గొప్ప సంఘసంస్కర్త సావిత్రిబాయి పూలే అని అన్నారు.
భర్త చనిపోతే అతని సంస్కారాలకు తలకొరివి పెట్టిన మొట్టమొదటి మహిళా మణి సావిత్రిబాయి పూలే.
మహిళా కార్మికులకు కనీస వేతనాలు ఇప్పించాలని పోరాటం చేసిన కార్మిక శక్తి సావిత్రిబాయి పూలే అని అన్నారు.
ఈ సందర్భంగా చట్టసభలలో మహిళలకు కేటాయించే 33% రిజర్వేషన్లలో బీసీ మహిళలకు వాటా కేటాయించాలని రామరాజు గారు డిమాండ్ చేశారు.
విద్యార్థినులకు రావలసిన పెండింగ్ స్కాలర్షిప్ లో వెంటనే విడుదల చేసి మహిళా విద్యార్థులు ఆరోగ్యవంతంగా అన్ని వసతులతో చదువుకునే విధంగా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు
మహిళా సాధికారత కోసం ప్రత్యేకమైన బడ్జెట్ను పెట్టి మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు పనిచేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో నేలపట్ల సత్యనారాయణ, కాసోజు విశ్వనాథం, నల్ల సోమ మల్లన్న, సొల్లేటి ప్రభాకర్, కంది సూర్యనారాయణ, కేశ బోయిన శంకర్ ముదిరాజ్, నకిరేకంటి కాశయ్య గౌడ్, పసుపులేటి సీతారాములు, రాపోలు పరమేష్, నాగులపల్లి శ్యాంసుందర్, కొన్నే శంకర్ గౌడ్, చొల్లేటి రమేష్, ఆదినారాయణ, గంజి బిక్షమయ్య నేత, , నేలపట్ల చంద్రశేఖర్, నల్ల మధు , మాధవి, టీఎన్జీవో ఉద్యోగ సంఘ నాయకులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments