నల్గొండ జిల్లాకు నూతనంగా నియమితులైన జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్‌ను నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపరిపాలన పేరుతో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరుపై ఇరువురు చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు జిల్లా కలెక్టర్‌గా చేపడుతున్న అన్ని కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తామని పున్నా కైలాష్ నేత తెలిపారు.
ప్రజల సంక్షేమం, జిల్లాలో సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు కన్నారావు, జిల్లపల్లి పరమేశ్, నాగార్జున, సచిన్, వినీత్, కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments