ఎన్జీ కాలేజ్ నుంచి క్లాక్ టవర్ వరకు ర్యాలీ
లయన్స్ ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా నిత్యం నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు అదనంగా ఈ సంవత్సరం
మెంటల్ హెల్త్ & వెల్బీయింగ్ హంగర్ సర్వీస్ పర్యావరణ పరిరక్షణ అనే మూడు సేవా వారాలను ప్రపంచవ్యాప్తంగా నిర్వహించేందుకు నిర్ణయించింది. ఈ కార్యక్రమాల్లో 14 లక్షల మంది లయన్స్ సభ్యులు పాల్గొని సేవలందించనున్నారు.
ఈ క్రమంలో జిల్లా 320E పరిధిలో జనవరి 3 నుంచి 11 వరకు నిర్వహించనున్న హంగర్ సర్వీస్ వీక్ (ఆకలి లేని సమాజ నిర్మాణం) కార్యక్రమాన్ని జిల్లా గవర్నర్ లయన్ మదన్ మోహన్ రేపాల నల్లగొండలో ప్రారంభించారు.
ఎన్జీ కాలేజ్ ప్రాంగణంలో లయన్స్ సర్వీస్ జెండా ఊపి హంగర్ సర్వీస్ వీక్‌కు అధికారికంగా శ్రీకారం చుట్టారు. అనంతరం సుమారు 150 మంది లయన్ సభ్యులు హంగర్ సర్వీస్‌కు సంబంధించిన ఫ్లెక్సీలతో ఎన్జీ కాలేజ్ నుంచి క్లాక్ టవర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు.
ర్యాలీ అనంతరం లయన్స్ క్లబ్బుల ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సహాయకులకు నిత్యం నిర్వహిస్తున్న అన్నవితరణ కార్యక్రమంలో సభ్యులు పాల్గొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న లయన్స్ ఇంటర్నేషనల్ హంగర్ సర్వీస్ వీక్‌ను జిల్లా గవర్నర్ లయన్ మదన్ మోహన్ రేపాల, జిల్లా హంగర్ సర్వీస్ వీక్ కోఆర్డినేటర్ లయన్ దశరథ జెల్లా ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ మరియు లయన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ లయన్ డాక్టర్ ఘట్టమనేని బాబు రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో జిల్లా హంగర్ సర్వీస్ మెంటార్ లయన్ భీమయ్య జగిని, డిస్ట్రిక్ట్ 320D గవర్నర్ లయన్ అమర్నాథ రావు, 320D పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గంధాని శ్రీనివాస్, ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ కేవీ ప్రసాద్, జిల్లా క్యాబినెట్ సెక్రటరీ లయన్ రామకృష్ణ చిలుకూరి, జిల్లా సర్వీస్ కోఆర్డినేటర్ లయన్ రవీందర్ రావు బాచుపల్లి, జిల్లా మిషన్ 1.5 కోఆర్డినేటర్ లయన్ శివశంకర్ రావు సింహాద్రి, డీసీ (ఆర్గానిక్ ఫార్మింగ్) లయన్ అంజి రెడ్డి ఏదుళ్ల తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ లెప్రసీ కాలనీలో 100 కుటుంబాలకు అన్నవితరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నల్లగొండ పట్టణంలోని 19 లయన్స్ క్లబ్బుల అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు మరియు లయన్స్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments