నల్గొండ మునిసిపల్ పరిధిలోని పలు వార్డుల్లో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఉదయమే ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ **వార్డు నెంబర్–28 (శ్రీకృష్ణ నగర్)**లో విస్తృతంగా పర్యటించారు.

పర్యటన సందర్భంగా స్థానికులతో ముఖాముఖి చర్చలు జరిపిన కలెక్టర్, మున్సిపాలిటీ ద్వారా చేపడుతున్న పారిశుధ్య పనులు, తాగునీటి సరఫరాపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. డ్రైన్ల పరిశుభ్రత, మురికి కాలువల శుభ్రతను పరిశీలించిన ఆయన, డ్రైన్లను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని శానిటేషన్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
వీధుల్లో చెత్త వేయడం గమనించిన చోట జరిమానా విధించాలని మున్సిపల్ కమిషనర్‌కు సూచించారు. అలాగే, మోతికుంట బండ్ పునరుత్తేజానికి చర్యలు చేపట్టాలని, అమృత్–2 పథకం కింద మోతికుంట బండ్ పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా మున్సిపాలిటీలో చేపడుతున్న పారిశుధ్య పనుల వివరాలను మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ కలెక్టర్‌కు వివరించారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments