నల్లగొండ పట్టణ–1 బీజేపీ అధ్యక్షులు గడ్డం మహేష్ గారి తండ్రి గడ్డం శంకరయ్య గారు కొద్దిసేపటి క్రితం హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ పరమపదించారు. ఆయన మృతి వార్త తెలుసుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు గడ్డం మహేష్ కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. మృతుడి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ దుఃఖాన్ని భరించే శక్తిని ప్రసాదించాలని వారు ప్రార్థించారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments