గాంధీ జ్ఞాన్ ప్రతిష్టన్ స్వర్ణోత్సవాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న “మహాత్మా గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సులు … స్వదేశి మేళాలు “కార్యక్రమాలలో భాగంగా ఈనెల 30వ తేదీన నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల ఆవరణలో భారీ స్థాయిలో రాష్ట్రస్థాయి సుస్థిర విజ్ఞాన సదస్సు మరియు స్వదేశమేల నిర్వహించనున్నట్లు గాంధీ జ్ఞాన్ ప్రతిష్టన్ ,గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ యానాల ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు .సత్యం అహింస సిద్ధాంతాల ఆధారంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను క్షేత్రస్థాయిలోకి ప్రజల్లోకి తీసుకు వెళ్లడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశం అని ఆయన తెలిపారు .వివిధ రంగాలలో గాంధీజీ విజ్ఞాన ప్రదర్శనలు ఈ సదస్సులో మహాత్మా గాంధీ జీవన తత్వాన్ని ప్రతిబింబించేలా గాంధీజీ విగ్రహాల సామూహిక ప్రదర్శన, చరకాల ప్రత్యక్ష ప్రదర్శన ,సుస్థిర విద్య ,సుస్థిర వైద్యం, సేంద్రీయ వ్యవసాయం ,సహజ ఇంధన వనరులు, పర్యావరణ పరిరక్షణ ,గ్రామీణ పరిశ్రమలు, సుస్థిర క్రీడలు, స్వదేశీ , స్వావ లంబన , స్వాబిమానం దిశగా ప్రదర్శనలు ,అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు .అదేవిధంగా పై అంశాలపై ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతుల ప్రధానం ,సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు మల్కంబు, యోగా ,ఎద్దు గానుగ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని పేర్కొన్నారు .గాంధీజీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా నల్లగొండ ఎన్జీ కళాశాల ఆవరణలో 5500 మంది బాల గాంధీల తోవేషధారణ గావించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన చారిత్రాత్మక సందర్భాన్ని ఈ సందర్భంగా డాక్టర్ యానాల ప్రభాకర్ రెడ్డి గుర్తు చేశారు .ఈ కార్యక్రమాన్ని ఉమ్మడి నల్లగొండ జిల్లాల స్వచ్ఛంద సంస్థలు ,వివిధ అసోసియేషన్స్, ప్రభుత్వ ,ప్రైవేటు రంగ ప్రతినిధులు ,అధికారులు ,అనధికారులు ,ఉపాధ్యాయ సంఘాలు ,క్రీడా సంఘాలు ,ప్రజాప్రతినిధులు ,ప్రజా సంఘాలు యువత ,విద్యార్థి సంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డాక్టర్ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమంలో సంస్థల చీఫ్ అడ్వైజర్ ఎంవి గోన రెడ్డి ,కార్యక్రమ కన్వీనర్ నీరుడు సంజీవరెడ్డి ,ప్రతినిధులు కే కరుణాకర్ రెడ్డి, బొమ్మ పాల గిరిబాబు ,కందిమల్ల నాగమణి ,జి జ్యోతి, పాముల అశోక్ ,ఎం శ్రీనివాస్ రెడ్డి ,ఎండి అజీజ్, వై రాధిక, ఎం అరుణ ,పి శ్రీనివాస్ గౌడ్, టీ చిరంజీవి వై ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments