నల్లగొండ: మహాత్మా జ్యోతిబాపూలే 135వ వర్ధంతి సందర్భంగా బిజెపి ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
తర్వాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పణ జరిగింది. బిజెపి జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మరియు బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు పిట్టల శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ,

కామారెడ్డి సాక్షిగా బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటించారన్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు సరైన గుర్తింపు ఇవ్వకపోవడం దారుణమని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లను లంబించి, కోర్టు వివాదాలు సృష్టించడం ద్వారా బీసీలను అవమానించినదని, గత BRS ప్రభుత్వం ఇచ్చిన 23% రిజర్వేషన్లను కూడా ఇవ్వకుండా, కేవలం 17%కి తగ్గించడం ద్వారా బీసీలపై వివక్ష చూపించిందని తెలిపారు.

ఈ ప్రభుత్వాన్ని బిజెపి ఓబీసీ మోర్చా నల్గొండ శాఖ తీవ్రంగా ఖండిస్తూ, బీసీలకు న్యాయం జరిగేంతవరకు ప్రజల పక్షాన నిలబడతామని, 42% రిజర్వేషన్లు అమలు చేయేవరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుల వద్ద నిలదీస్తామని ప్రతిజ్ఞ వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు:
జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్, బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఏరుకొండ హరి, జిల్లా ప్రధాన కార్యదర్శులు కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, మండల వెంకన్న, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు పెరిక మునికుమార్, నారాల శంకర్, జిల్లా ఉపాధ్యక్షులు ఫకీర్ మోహన్ రెడ్డి, టూ టౌన్ పట్టణ అధ్యక్షులు మిర్యాల వెంకన్న, నరాల శంకర్, శాంతి స్వరూప్, బద్దం నాగేష్, గురిజాల సైదులు, ఆవుల కోటి, పెరిక నరసింహ, నరేందర్ గౌడ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments