ePaper
Monday, March 16, 2026

కుష్టు వ్యాధిగ్రస్తుల కుటుంబాలకు బియ్యం, నూతన వస్త్రాలు, దుప్పట్ల పంపిణీ

నల్గొండ పట్టణంలోని శాంతి నగర్ లెప్రసీ కాలనీ, లెప్రసీ హెల్త్ సెంటర్ మరియు అంబేద్కర్ లెప్రసీ కాలనీలలో కుష్టు వ్యాధిగ్రస్తుల కుటుంబాలకు క్రిస్మస్, నూతన సంవత్సరం సందర్భంగా గ్రేస్ సర్వీస్ సొసైటీ (ఖమ్మం) ఆధ్వర్యంలో సహాయ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 280 కుటుంబాలకు బియ్యం, నూతన వస్త్రాలు, దుప్పట్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ డీఎస్పీ శివరామిరెడ్డి హాజరై, ఆయన చేతుల మీదుగా పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, గ్రేస్ సర్వీస్ సొసైటీ సంస్థ 28 సంవత్సరాలుగా కుష్టు వ్యాధిగ్రస్తుల సంక్షేమం కోసం చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. సంస్థ వైద్య శిబిరాలు, బియ్యం, భోజనం, బట్టలు, నిత్యావసర సరుకుల పంపిణీ ద్వారా నిరంతరం సేవలందిస్తున్నట్లు తెలిపారు.

ఈ నూతన సంవత్సరంలో 2300 కుష్టు వ్యాధిగ్రస్తుల కుటుంబాలకు బియ్యం, నూతన వస్త్రాలు, దుప్పట్లు పంపిణీ చేయనున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, బచ్చల సౌర్య, క్రిస్టఫర్, అంబికా సిస్టర్, ఎర్నెస్ట్ పాల్, సంస్థ సిబ్బంది జాన్, రమేష్, రాము, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!