ePaper
Tuesday, March 17, 2026

ట్రూ జోన్ సోలార్ స్టోర్ ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నల్గొండ, డిసెంబర్ 28 (ట్రూత్):

జిల్లా ప్రజలు సోలార్ విద్యుత్‌ను విస్తృతంగా వినియోగించుకోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డుపై వివేకానంద విగ్రహం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రూ జోన్ సోలార్ స్టోర్‌ను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నల్గొండ పట్టణంలో ప్రజలకు అందుబాటులో ఉండే సోలార్ స్టోర్ ప్రారంభం కావడం శుభపరిణామమన్నారు. సోలార్ వినియోగం ద్వారా విద్యుత్ పొదుపు ఎక్కువగా ఉండడంతో పాటు ఖర్చు కూడా తక్కువగా ఉంటుందని తెలిపారు. భవిష్యత్తులో సోలార్ వినియోగం మరింతగా పెరుగుతుందని అన్నారు.

స్టోర్ నిర్వాహకులు మంత్రిని శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ట్రూ జోన్ సోలార్ సీఈవో శ్రీనివాస్ జక్కాల, నల్గొండ జిల్లా డీలర్ చింతపల్లి కృష్ణ, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, సర్పంచులు పాప కంటి సైదులు, వెంకన్న యాదవ్, చింతపల్లి జానీ, గోలి సైదులు, వేణు, మేడరి శ్రీనివాస్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!