సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నది
యేసు ప్రభువు కృపతో ప్రజలు అంతా ఆనందంగా ఉండాలని,తెలంగాణ రాష్ట్రం అభివృద్ది పథంలో సాగాలని ప్రార్ధిస్తున్న*

నల్లగొండ క్రిస్మస్ వేడుకల్లో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
నల్లగొండ:
క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకుని నల్లగొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లోనీ పురాతన సేయింటినరీ బాప్టిస్ట్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలలో రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. కేక్ కట్ చేసి క్రిస్మస్ సంబరాల్లో పాల్గొన్న మంత్రి,ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ….
యేసు క్రీస్తు జన్మదినం సందర్భంగా క్రైస్తవ సోదర,సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పురాతన సేయింటినరీ బాప్టిస్ట్ చర్చిలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో వేలాది మందితో కలిసి పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. యేసుక్రీస్తు బోధనలు ప్రేమ, శాంతి,త్యాగం,సేవా భావాన్ని మనకు గుర్తుచేస్తాయన్నారు. మిషనరీలు,హాస్పిటల్స్ సేవా భావంలో క్రైస్తవులు ముందుంటారన్నారు. యేసు బోధనలు శాంతిని,ప్రేమను కోరుకునే విధంగా ఉంటాయని,శత్రువును సైతం క్షమించే గుణం కలిగి ఉండాలనే ఆయన బోధనలు ప్రపంచ మానవాళికి ఆచరణీయం అన్నారు.
డిసెంబర్ నెల అంటే తెలంగాణ ప్రజలకు సంతోషాన్ని నింపిన నెల అని,డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన చేసిన రోజు..తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ పుట్టిన రోజు ఒకే రోజు కావడం మన అదృష్టమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్ల తర్వాత ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నామని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు,సన్నబియ్యం లాంటి మానవీయ కోణంలో పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న..ముఖ్యమంత్రి,మంత్రులం సమష్టిగా పనిచేస్తూ..రాష్ట్రాన్ని రెండేళ్లుగా క్రమంగా గాడిన పెడుతున్నామని అన్నారు.
యేసు ప్రభువు కృపతో ప్రజలు అంతా ఆనందంగా ఉండాలని,తెలంగాణ రాష్ట్రం అభివృద్ది పథంలో సాగాలని ప్రార్ధిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, డిసిసివిలియమ్స్, క్రిస్టోఫర్, ఆశయ్య,పసల శౌరయ్య, ప్రవీణ్, ఆనంద్ ప్రసాద్, పలువురు మాజీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments