న్యూస్ రిపోర్ట్:
నల్లగొండ (గ్రామీణ):
గ్రామీణ స్థాయిలో ప్రజలకు ప్రథమ చికిత్స అందించడంలో ఆర్ఎంపీ వైద్యుల పాత్ర ఎంతో కీలకమని రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో ఉన్న శుశ్రుత గ్రామీణ వైద్య సంఘం భవనంలో నిర్వహించిన 19వ వార్షికోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర, జిల్లా గౌరవ అధ్యక్షుడు పోనుగంటి హనుమంతరావు అధ్యక్షత వహించారు.
మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వారి సమస్యల పరిష్కారానికి సహకరిస్తుందని భరోసా ఇచ్చారు. గ్రామస్థాయిలో రోగులకు ప్రథమ చికిత్స అందించడంలో ఆర్ఎంపీ వైద్యుల సేవలు అభినందనీయమని తెలిపారు. ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, వాటిని వినియోగించుకునేలా మార్గనిర్దేశం చేయాలని సూచించారు.
కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ, పేద విద్యార్థుల ఉన్నత విద్య కోసం ఆర్థిక సహాయం అందిస్తూ ప్రోత్సహిస్తున్నామని మంత్రి తెలిపారు.
ఈ సందర్భంగా మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో ఆర్ఎంపీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం గుర్తించి పరిష్కరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి, శుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షుడు, వ్యవస్థాపకుడు బొల్లెపల్లి శ్రీనివాసరాజు, రాష్ట్ర అధ్యక్షుడు నేతి రాజేశ్వరరావు, విజ్ఞాన దర్శిని వ్యవస్థాపకుడు రమేష్, సీపీఎం రైతు సంఘం నాయకుడు భాస్కర్ రెడ్డి, స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ మెంబర్, కెమిస్ట్రీ & డ్రగ్జిస్ట్ అసోసియేషన్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు పరమాత్మ, గోవర్ధన్ అశోక్ సత్యనారాయణ చారి, కందికట్ల లక్ష్మయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రితో పాటు పలువురు ప్రముఖులను శాలువాలతో, మాలలతో ఘనంగా సన్మానించారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments