e-paper
Thursday, January 29, 2026

కలెక్టరేట్ ఎదుట రిటైర్డ్ ఎంప్లాయిస్ నిరాహార దీక్ష.

రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయాలని డిమాండ్.

తాము పదవి విరమణ పొంది 21 నెలలు గడిచిన తమకు ఇంతవరకు ప్రభుత్వం నుండి బకాయిలు చెల్లించలేదని దీంతో అనేకమంది అనారోగ్య సమస్యలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వెంటనే బకాయిలు చెల్లించాలని, రిటైర్డ్ ఎంప్లాయిస్ జిల్లా అధ్యక్షుడు కొంపల్లి బిక్షపతి డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన నిరాహార దీక్షలో ఆయన మాట్లాడుతూ
2024 మార్చి తదుపరి ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు రావలసిన పెన్షన్ బకాయిలు ఏక మొత్తంగా, వెంటనే చెల్లించాలని ఈ రోజు నిరాహార దీక్ష ద్వారా ప్రభుత్వం ను డిమాండ్ చేయడం జరిగిందన్నారు. ఈ దీక్షా శిబిరంలో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు దీక్షకు సంఘీభావంగా పాల్గొన్నారు. నేటి నిరాహార దీక్షలో రామకృష్ణారెడ్డి, ముజాహిద్ అలీ ఖాన్, గణేష్, శంకరయ్య, వెంకటేశ్వర్లు, వెంకటరెడ్డి, బిక్షం,లక్ష్మారెడ్డి, భాస్కర్ రెడ్డి,సుధాకర్ రెడ్డి, శ్యాంసుందర్,నారాయణరెడ్డి, భాస్కర్,ఏడుకొండలు, బాలయ్య, రాధాకృష్ణ,సుజాత, నాగమణి,సుధారాణి,శ్రీనివాస్ రాములు, మంగమ్మ,కిషన్ రావు,నరేందర్ లింగయ్య, కృష్ణయ్య, తదితరులు పాల్గొని నిరాహార దీక్షను విజయవంతం చేసినారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!