నిజామాబాద్ జిల్లాలో చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగి సామాన్యులకు భారంగా మారాయి. వేసవి తీవ్రతతో పాటు పెళ్లిళ్ల సీజన్ కారణంగా డిమాండ్ పెరగడంతో ధరలు పెరుగుతున్నాయి.
ప్రస్తుతం స్కిన్లెస్ చికెన్ కిలో ధర రూ.380 నుంచి రూ.400 వరకు ఉండగా, లైవ్ కోడి ధర రూ.180 నుంచి రూ.220 వరకు, డ్రెస్డ్ చికెన్ ధర రూ.280 నుంచి రూ.320 వరకు ఉంది.
వేసవి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడంతో కోళ్ల ఫారాల్లో నిర్వహణ కష్టమవుతోంది. అధిక వేడి కారణంగా కోళ్లు చనిపోవడం, తక్కువ మేత తినడం వల్ల వాటి బరువు పెరగకపోవడం సరఫరాపై ప్రభావం చూపుతోంది.
కూలర్లు, స్ప్రింక్లర్లు ఏర్పాటు చేయడం వల్ల విద్యుత్ ఖర్చులు పెరిగాయి. నష్టాల భయంతో పలువురు రైతులు కోళ్ల పెంపకాన్ని తగ్గించడం లేదా నిలిపివేయడం వల్ల మార్కెట్లో సరఫరా తగ్గింది.
ధరలు పెరగడంతో వినియోగదారులు చికెన్ కొనుగోలు తగ్గించారు. సాధారణంగా రద్దీగా ఉండే మార్కెట్లు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. అమ్మకాలు గణనీయంగా పడిపోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
ఇదే పరిస్థితి కొనసాగితే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని పౌల్ట్రీ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments