నల్లగొండ:
నల్లగొండ పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న బీసీ బాలికల హాస్టల్‌లో తీవ్ర కలకలం రేగింది. హాస్టల్‌లో నివసిస్తున్న ఓ విద్యార్థిని యాసిడ్ తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆ విద్యార్థిని ఎన్‌జీ కళాశాలలో చదువుతున్న విద్యార్థినిగా గుర్తించారు. ఘటన అనంతరం ఆమెను నల్లగొండ–దేవరకొండ రోడ్డులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నట్లు వైద్యులు తెలిపారు.
విద్యార్థిని కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. అయితే, ఇదే కారణమా లేదా ఇంకా ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనే అంశాలపై పోలీసులు సమగ్రంగా విచారణ చేపట్టారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments