మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర 2026 హుండీల లెక్కింపు ఈరోజు (ఫిబ్రవరి 5) ప్రారంభమైంది.
హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు హుండీల లెక్కింపు ప్రశాంతంగా కొనసాగింది.
👉 తొలి రోజు ముఖ్య వివరాలు:
🔹 తెరిచిన హుండీలు: 125 🔹 లభించిన నగదు: ₹ 2,49,65,000 (రూ. 2.49 కోట్లు) 🔹 బంగారం, వెండి: వేర్వేరు ఐరన్ హుండీల్లో భద్రపరిచి లాక్ 🔹 నాణేల లెక్కింపు: ఇంకా ప్రారంభం కాలేదు
👉 మొత్తం హుండీల వివరాలు:
🔸 ఐరన్ హుండీలు: 780 🔸 క్లాత్ హుండీలు: 45 🔸 రైస్ హుండీలు: 3 🔸 మొత్తం హుండీలు: 828
దేవాదాయ శాఖ ఉద్యోగులు, సేవా సమితుల సభ్యులు సుమారు 500 మంది పర్యవేక్షణలో లెక్కింపు జరుగుతోంది.
ఈరోజు లెక్కించిన నగదును బ్యాంకు అధికారులకు అప్పగించారు.
👉 లెక్కింపు ప్రక్రియ ప్రతి రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.
👉 మొత్తం లెక్కింపు సుమారు 10 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments