నార్కట్‌పల్లి మండల కేంద్రంలో అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. వేగంగా వెళ్తున్న ఒక డీసీఎం వాహనం అదుపు తప్పి స్థానిక మెడికల్ షాపులోకి దూసుకెళ్లింది. ప్రమాదం తీవ్రతకు వాహనం ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. సమీపంలోని కొన్ని దుకాణాలు కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయి.
ప్రమాద సమయంలో డీసీఎం క్యాబిన్లో డ్రైవర్ ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడ్డాడు. దాదాపు మూడు గంటల పాటు అతడు వాహనంలోనే చిక్కుకుని నరకయాతన అనుభవించాడు. సమాచారం అందుకున్న ఎండి అజహరుద్దీన్ తన బృందంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మరియు కొంతమంది సాహసోపేత వ్యక్తులు కలిసి గ్యాస్ కట్టర్లు, ఇతర పరికరాలతో క్యాబిన్‌ను కోసి డ్రైవర్‌ను బయటకు తీశారు.
ప్రస్తుతం డ్రైవర్‌కు ప్రాణాపాయం తప్పిందని, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఒక ప్రాణాన్ని కాపాడిన అజహరుద్దీన్, పోలీస్ బృందాన్ని స్థానికులు అభినందిస్తున్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments