నల్లగొండ | స్థానిక వార్తలు:
నల్లగొండ జిల్లా కేంద్ర ప్రజల దాహార్తిని తీర్చే ప్రధాన నీటి వనరు ఉదయ సముద్రంలో గత రెండు రోజులుగా చనిపోయిన గేదె ఉండటం తీవ్ర కలకలం రేపుతోంది. గేదె మృతదేహాన్ని గుర్తించకపోవడం, తొలగించకపోవడం వల్ల మంచినీరు తీవ్రంగా కాలుష్యం అవుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలకు తాగునీరు సరఫరా అయ్యే సముద్రంలో ఇలాంటి పరిస్థితి నెలకొనడం పట్ల సంబంధిత అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండు రోజులుగా మృతదేహం నీటిలోనే ఉండటంతో దుర్వాసన వస్తోందని, నీటి నాణ్యతపై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘటన ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతుందని, వెంటనే మృతదేహాన్ని తొలగించి నీటిని శుద్ధి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments