2025-26 రబీ ధాన్యం సేకరణ ప్రారంభమైన నేపథ్యంలో, ధాన్యం కొనుగోలుకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు.
సోమవారం జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కంట్రోల్ రూమ్‌ను ఆయన ప్రారంభించారు. రైతులు ధాన్యం కొనుగోలులో ఎదురయ్యే సమస్యలను 9963407064 నంబర్‌కు తెలియజేయాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం రబీ సీజన్లో రైతులు పండించిన ధాన్యానికి క్వింటాల్‌కు గ్రేడ్ “ఏ” రకానికి ₹2389, సాధారణ రకానికి ₹2369 కనీస మద్దతు ధర ప్రకటించినట్లు తెలిపారు. అదనంగా సన్నధాన్యానికి క్వింటాల్‌కు ₹500 బోనస్ కూడా ఇస్తున్నట్లు వెల్లడించారు.
రైతులు నాణ్యత ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, తేమ, తాలు, తరుగు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో తేమ కొలిచే యంత్రాలు, తూకం యంత్రాలు, టార్పాలిన్లు వంటి అన్ని సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు.
కంట్రోల్ రూమ్‌కు వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని, 24 గంటలపాటు సిబ్బంది విధులు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ రాంపతి తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments